Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన తమన్నా, ఇప్పుడు మన సౌత్ లో ఎక్కువగా నార్త్ ఇండియా లోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా ఆమె ప్రతిష్టాత్మక చిత్రాలలో భాగం అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించాల్సిన ఆమె , ఇలా ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. తమన్నా రేంజ్ కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ‘బాహుబలి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘నేటి పరిస్థితులను బట్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం అద్భుతంగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆరోజుల్లోనే 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. వ్యాపార పరంగా చూస్తే , అప్పటి పరిస్థితులను బట్టీ , ఫ్లాప్ కి దారి తీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆరోజుల్లో రాజమౌళి తన విజన్ కి తగ్గట్టు , ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ అలంకరణ కాబట్టే సమస్యలు , అంతటి అద్భుతమైన విజయాన్ని నిరూపిస్తూ, లేదంటే చాలా పెద్ద ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ప్రస్తుతం ఈమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ మీదనే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఓడెల 2’ విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అదే తెలుగులో ఈమె చివరిగా కనిపించిన చిత్రం. ఆ సినిమా తర్వాత తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఇక ఈడాది ఆమె చేతిలో ‘ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘పురుషన్’, ‘వీ శాంతారం’, ‘రాకేష్ మరియా బయోపిక్’ , ‘రాగిణి 3’, ‘భోలే చుడియన్’ వంటి హిందీ చిత్రాలు రూపొందుతున్నాయి. వీటిల్లో కొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి.

