బిగ్ బాస్ 10: ఇప్పటికే తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఇప్పుడు పదవ సీజన్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. గత సీజన్లో కళ్యాణ్ పడాల అంటే కంటెస్టెంట్ విన్నర్‌గా నిలిచాడు. ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అంటూ ప్రారంభించిన షో ద్వారా హౌస్ కొంతమంది కంటెస్టెంట్లను పంపించారు. అలా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి కప్పుకున్నాడు.
ఇక బిగ్ బాస్ పదవ సీజన్ కి కూడా ఇదేవిధంగా ‘అగ్నిపరీక్ష’ పేరుతో మరో షో నిర్వహించేందుకు జియో హాట్ స్టార్, స్టార్ మా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు, బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన సెట్ వర్క్ కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లుగా కనిపిస్తోంది.
బిగ్ థర్డ్ సీజన్ నుంచి ఇప్పటివరకు విజయవంతంగా హోస్ట్‌గా నాగార్జున, ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. గత సీజన్లలో మరింత భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇక సెట్ వర్క్ ఈరోజు ప్రారంభమవగా, చాలా త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దీనికి సమాంతరంగా, ‘బిగ్ అగ్నిపరీక్ష’ ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించబోతున్నారు.

