నీట్ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం కార్పోరేషన్ : ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యా సమస్యలపై కాక్రోచ్జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడికి పాల్పడ్డారు, యువతపై లాఠీఛార్జి చేసి బాష్పవాయువును నిరసిస్తూ బుధవారం అనంతపురం షో టవర్క్లాక్లో సిపిఐ జిల్లా కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులపై లాఠిఛార్జి ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. నీట్ పేపర్ లీకేజీని, విద్యార్థులపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంతో విద్యారంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాస్TÖకరణ దిశగా నడిపించడం వల్లనే పరీక్షల నిర్వహణ గాడి తప్పింది. వరుసగా పరీక్ష పేపర్ల లీకులతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని నరేంద్రమోడీపై వ్యతిరేకత పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలోని, జనసేన కూటమి ప్రభుత్వం జాగ్రత్తపడాల్సి టిడిపి ఇప్పటికైనా. లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వాలు కూల్చివేశారో అలాగే ఇక్కడి కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడేందుకు. ప్రభుత్వంలో చిలీకలు తెచ్చి రాజకీయ సంక్షోభాన్ని కేంద్రం తీసుకొస్తుందని, జాగ్రత్తగా ఉండాలి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని.
కేంద్రంపై ప్రజలు తిరగబడతారు…
సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై చేపడుతున్న వ్యతిరేకత, నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. ఇలాగే నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. విద్యార్థులపై జరిగిన లాఠిఛార్జిని ఖండిస్తూ, వారికి సంఘీభావంగా సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
24న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి
ఈఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్
ఢిల్లీలో విద్యార్థులపై లాఠిఛార్జిని నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ తెలిపారు. ప్రభుత్వని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వంగా వ్వహరిస్తోందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వ హయాంలో 89 ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని అన్నారు. ఈ నెల 24వ తేదీన చేపడుతున్న బంద్‌లో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, సహాయ కార్యదర్శి మస్తాన్, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ, టి.నారాయణస్వామి, నగర సహాయదర్శులు రమణయ్య, వీకే కృష్ణుడు, లింగ, అనంతపురం రూరల్ మండల కార్యదర్శి జి.నరేష్, బుక్కరాయసముద్రం మండల కార్యదర్శి బండి రామకృష్ణ, ఎఐటియుసి నాయకులు చిరంజీవి, సిపిఐ నాయకులు అలీ, లక్ష్మి.


