అంబర్‌పేట, వెలుగు: బినామీ లావాదేవీలు చట్టవిరుద్ధమని, అలాంటి ఆస్తులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా జప్తు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలంగాణ, ఏపీ అదనపు ఆదాయ పన్ను కమిషనర్ వై.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ త్రీస్టార్‌లో శుక్రవారం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఏ సాంబమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.
నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం–1988ని సవరించి, ‘బినామీ లావాదేవీల(నిషేధ) సవరణ చట్టం–2016’గా మార్చిందని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీఏ చంద్రశేఖర్ వేముల, సీఏ ఆశిష్ జోషి, సోమేశ్వర్ నెమ్మాని, సీఏ రామ్‌దేవ్ బుటాడా, కాంపిటేషన్ కమిటీ చైర్మన్ సీఏ అమృత్‌కుమార్ కోట, సీఏపీ పీవీనారాయణరావు ఉన్నారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బినామీ లావాదేవీలు చేస్తే జైలుకే..ఆదాయపు పన్ను అదనపు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

