విశాఖ బీచ్ రోడ్డులో చంద్రబాబు సైకిల్ పై ప్రయాణించారు. ఆంధ్రయూనివర్సిటీ నుంచి నోవోటెల్ వరకు సైకిల్ పై ఉన్నారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21:18 నిమిషాల్లో చంద్రబాబు చేరుకున్నారు. అంతకు ముందు ఏయూ క్యాంపస్ లో చంద్రబాబు మాట్లాడుతూ పచ్చదనం, పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలన్నారు. నెట్ జీరో క్యాంపస్ గా ఏయూను డిజైన్ చేయాలని సూచించారు.
ఎంతో విశిష్టమైన ప్రముఖులను ఏయూ తయారు చేసిందని చెప్పారు. ఎండలు విపరీతంగా పెరిగాయి.. పర్యావరణ పరివర్తన దెబ్బతింటోందని చెప్పారు. ఓవైపు విపరీతమైన ఎండలు.. లేకుంటే తుఫానులు వస్తున్నాయని, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని, ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉందని, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెట్టాలని… బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. క్యాంపస్‌కు అవసరమైన విద్యుత్ సోలార్ ద్వారా వచ్చేలా చూడాలని ఏయూ అధికారులను చంద్రబాబు తీసుకున్నారు.

