కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్‌గా ‘సింగం’ అనిపించుకుని, ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలను షేక్ చేసిన కే. అన్నామలై లేటెస్ట్ గా బిజెపికి రాజీనామా చేసి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ లైఫ్‌లో చాలామందికి తెలియని ఒక క్రేజీ అండ్ సైలెంట్ చాప్టర్ ఉంది. . అదే.. ఆయన వెండితెర ఎంట్రీ! అది కూడా కేవలం ‘ఒక్క రూపాయి’ రెమ్యునరేషన్‌తో నే.. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా 1700 పాదయాత్ర చేసి, పార్టీ ఓట్ షేర్‌ను 3% నుండి 11%కి పెంచిన అన్నామలై.. ‘అరబ్బీ’ (అరబ్బీ) అనే కన్నడ చిత్రంతో వెండితెరపై మెరిశారు. రెండు చేతులూ లేకపోయినా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పారా-స్విమ్మింగ్ ఛాంపియన్ ‘విశ్వాస్ కేఎస్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో ఆయన ‘స్విమ్మింగ్ కోచ్’ పాత్ర పోషించారు. మంగళూరులో ఒక ఈవెంట్లో అన్నామలైని కలిసిన డైరెక్టర్ రాజ్‌కుమార్, ఈ పాత్ర కోసం ఆయన్ని సంప్రదించారు. కథతో, కేవలం ఒకే ఒక్క రూపాయి నచ్చాయి ఫీజు తీసుకుని నటించడానికి అన్నామలై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా, షూటింగ్ సెట్‌కు రాజకీయాల్లో వచ్చిన అన్నామలై తన అద్భుతమైన మెమొరీ పవర్‌తో కేవలం ఒకటిన్నర రోజుల్లోనే తన సీన్స్‌తో పాటు ఒక సాంగ్ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసి యూనిట్‌ని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా అసలు హీరో విశ్వాస్ కేఎస్. చిన్నతనంలో కరెంట్ షాక్ వల్ల రెండు చేతులను, తండ్రిని కోల్పోయిన విశ్వాస్.. అధైర్యపడకుండా కుంగ్ ఫూ, డాన్స్, స్విమ్మింగ్ నేర్చుకుని 2016 అంతర్జాతీయ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున మూడు పతకాలు సాధించాడు. తన బయోపిక్‌లో తనే హీరోగా నటించాడు.
పదవులు, రాజకీయం కాకుండా.. వైకల్యాన్ని జయించిన ఒక యోధుడి కథను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే అన్నామలై ఈ సినిమాలో 2024లోనే నటించారు. రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఎలా ఉన్నా, ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ‘వన్ రూపీ’ సినిమా ప్రయత్నం నిజంగా గ్రేట్ కదా.. అంటూ నెటిజన్లు , ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

