గౌతమ్ గంభీర్ : ఐరిష్ సిరీస్ వైట్ వాష్ అయింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఆ జట్టుతో సిరీస్ కోల్పోయింది. ఇది కూడా కలలో ఊహించలేదు. పైగా దారుణమైన ఓటములు ఎదురయ్యాయి. ఇది కూడా కలలో ఊహించలేదు. ఇన్ని ఉపద్రవాలు.. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడలేదు. పైగా వైట్ బాల్ ఫార్మాట్ లో కు తిరుగులేదు. అటువంటి జట్టు ఇబ్బంది పడడం
గతంలో ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు.. వెంటనే జట్టు తేరుకునేది. సూపర్ ఆట తీరుతో ఆకట్టుకునేది. పోరాటాన్ని కొనసాగించే విజయాన్ని తన ఖాతాలో వేసుకునేది. అందువల్లే 2024.. 2026 లో పొట్టి ప్రపంచ కప్‌లు అందుకుంది. అటువంటి స్థాయి ఉన్న జట్టు ఇప్పుడు అనామకమైన జట్ల చేతిలో ఓడిపోతోంది. జట్టు ఇలా ఓడిపోవడాన్ని మేనేజ్మెంట్ ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఆట తీరు.. కోచ్ గంభీర్ వ్యవహార శైలి మీద తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన అసంతృప్తిలో బీసీసీఐ కనిపించింది.. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ వేలు పెడుతూ ఇష్టానుసారంగా ఆటగాళ్లను మార్చేస్తున్నాడు. ఇది కెప్టెన్ శ్రేయస్ ను గందరగోళానికి గురిచేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జట్టు మీద అయ్యర్ పట్టు సాధించలేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందువల్లే టీం ఇండియా కనివిని ఎరుగని రేతుల్లో రెండు వరుస సిరీస్‌లను కోల్పోయింది.
జట్టు ఇలా ఓడిపోవడం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అసహనంతో ప్రారంభమైంది. అయ్యర్ మీద.. గంభీర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పర్యటన తర్వాత టీమ్ ఇండియా స్వదేశానికి రాగానే.. కాయకల్ప చికిత్స ఉంటుందని.. కచ్చితంగా మార్పులు ఉంటాయని. గంభీర్ శిక్షణలో చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. రెడ్ బాల్ ఫార్మాట్ లో ఇప్పటికే జట్టు అట్టర్ ప్లాఫ్. ఇప్పుడు ఆ దరిద్రం వైట్ బాల్ ఫార్మాట్ వరకు వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే కొంప ముగిసిపోతుంది. తన ప్రభను కచ్చితంగా కోల్పోతుంది.
అక్కడిదాకా రావద్దు అనుకుంటే.. పరిస్థితి మెరుగైన స్థితిలో ఉండాలి అనుకుంటే.. కచ్చితంగా మార్పులు జరగాలి. ఒకప్పటి మాదిరిగానే జట్టు ఉండాలి. అద్భుతమైన ఆట తీరు కొనసాగించాలి. ప్లేయర్లలో క్రీడా స్ఫూర్తి కనిపించాలి. ప్లేయర్లను పదేపదే మార్చకూడదు. సారథి విషయంలో కూడా మేనేజ్మెంట్ మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా జట్టు కోచ్ కు అధికారాలను కొంతవరకు పరిమితం చేయాలి. అప్పుడు మాత్రమే క్రికెట్లో ఒకప్పటి పెత్తనాన్ని అందుకుంటుంది. లేకపోతే అంతే సంగతులు.

