హైదరాబాద్: ఇప్పటికే అన్ని పోలింగ్ బూతుల్లో బిఎల్ ఎలను నియమించామని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్, బెంగాల్ లో ఓట్లు తొలగించి బిజెపి అధికారంలోకి వచ్చిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ఇప్పటికే 1.2 కోట్ల ఓట్లను అన్ మ్యాప్ చేశారు, బిఎల్ ఎలు అలర్ట్ గా లేకపోతే భారీగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని తెలియజేశారు. నెల రోజుల పాటు బిఎల్ఎలు బూత్ ను విడిచి వెళ్లొద్దు అని సూచించారు. ప్రతి 10 బూత్‌లకు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి..ఒక సూపర్ వైజర్ చొప్పున పెడుతున్నామని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

