– ప్రకటన –
పెరిగిన బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు
నవతెలంగాణ-హైదరాబాద్
బెంగళూరు – హైదరాబాద్ మధ్య రవాణా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాలను మరింత పెంపొందించేందుకు గాను, రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్) పాయింట్లను భారీగా పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు తమకు నచ్చిన, సమీపంలోని ప్రాంతాల నుండి సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను ఏర్పాటు చేయడం తెలియజేసింది.
బెంగళూరు పాయింట్లు
పీనియా రూట్లో పీనియా , యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ , కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్ , ఎస్టీమ్ మాల్ , ఎలాహంక బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహల్లి బైపాస్
2.చందాపూర్ రూట్లో చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ ,బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ , ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
మార్తహళ్లి రూట్లో జంక్షన్, మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్, ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
హైదరాబాద్ పాయింట్లు
1.పటాన్చెరు రూట్లో పటాన్చెరు నుంచి ఎంజీబీఎస్ , ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో,
2.జేబీఎస్ రూట్లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో,
3.హయత్ నగర్ రూట్లో హయత్ నగర్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డిం, గ్అలైటింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
టీజీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మీ ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఏంచుకుని, సురక్షితమైన. సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని సూచించింది. ప్రయాణికులు తమ టికెట్లను బుక్కు టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in ను సందర్శించాలని బుధవారం ఒక ప్రకటనలో చేర్చబడింది.
– ప్రకటన –

