- సోషల్ మీడియాలో ”కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్..
- మెజారిటీ ఫాలోవర్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్లే..
- కొత్త వాదనను ఎత్తి చూపుతున్న నెటిజన్లు..
బొద్దింక జనతా పార్టీ: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల్లోనే 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. రాజకీయ వ్యంగ్యాస్త్ర వేదికగా ప్రారంభమైన సీజేపీ అనతి కాలంలోనే దేశంలో సంచలనంగా మారింది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు దాటి సంచలనం సృష్టించింది.
అయితే, ఈ రేంజ్లో ఫాలోవర్లు పెరిగిపోవడంపై భారత్‌లోని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు సీజేపీ ఫాలోవర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలను ఆధారంగా చూపిస్తున్నారు. సీజేపీ ఫాలోవర్లలో ఎక్కువ మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన వారని చెబుతున్నారు. భారత్ నుంచి కొద్ది మాత్రమే ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఇన్స్టాగ్రామ్, మెటా అధికారికంగా ధ్రువీకరించలేదు.
పాకిస్థాన్ ఫాలోవర్లే ఎక్కువా..?
కొంతమంది ఎక్స్ యూజర్లు సీజేపీ ఫాలోలో 77 శాతం మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారని చెబుతున్నారు. భారత్ నుంచి కేవలం 9 శాతం మంది మాత్రమే ఉన్నారని పోస్టులు చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఎస్‌డీపీఐల మద్దతుదారులు ప్రమోట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్కువ కాలంలో ఇంత మంది ఫాలోవర్లు రావడం వెనుక బాట్ అకౌంట్లు లేదా ఇన్‌యాక్టివ్ లేని అకౌంట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
ఎలా మొదలైంది, ఎవరు.?
ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు సెటైర్‌గా ఈ సీజేపీ కనిపిస్తోంది. మే 15న జరిగిన ఒక విచారణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీలో ఉద్యోగాలు పొందాలని వారిని ”బోధించండి”, ”పారసైట్”లు అంటూ వ్యాఖ్యానించినా వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన స్పష్టతను ఇస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను యువతను అనలేదని, నకిలీ డిగ్రీతో జాబ్స్ చేసి మరోసారి ఉద్దేశించి అన్నానని చెప్పారు.
ఈ డిజిటల్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వర్కర్ అభిజిత్ దీప్కే రూపొందించారు. అయితే, ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న సీజేపీ అకౌంట్‌ను ఎక్స్‌లో నిలిపేశారు. తాము ముందే ఊహించినట్లు సీజేపీని భారత్‌లో నిలిపేశారని దీప్కే అన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజేపీ కొన్ని రాజకీయ డిమాండ్లు కూడా చేసింది. రిటైర్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ పదవులు నిషేధం, పార్టీలు మారిన వారికి 20 శాతం నిషేధం, పార్లమెంట్, కేంద్ర కేబినెట్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, అంబానీ అదానీల యాజమాన్యంలోని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేసింది.
పాకిస్తాన్ జనతా పార్టీ pic.twitter.com/Abdlqm0AsL
— తజిందర్ బగ్గా (@TajinderBagga) మే 21, 2026

