మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేస్తోందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది ఆలయాలకు తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత జిహెచ్ఎంసి పరిధిలోని 3427 దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15.05 కోట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో విడుదల చేసినట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ నెల 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాల్లో భాగంగా 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ముఖాముఖి ఉత్సవం, 21న అమ్మవారికళ్యాణం, 22న రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 9న హైదరాబాద్‌లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు, ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు సమన్యయంతో పనిచేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
బోనాల సందర్భంగా గోల్కొండ, ఉజ్జయిని మ హంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ, పోచమ్మ, హరిబౌలిలోని అక్కన్న- మాదన్న దేవాలయం, కా ర్వాన్ దర్బార్ మైసమ్మ, లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, మీరాలంలో సంప్రదాయ మండి శ్రీ మహంకాళి ప్రభుత్వం 30 ఆలయాలతో పాటుగా నిర్వహించారు.

