ఆకాశం అవచుల దాకా సాగే సాహస ఎవరెస్టు యాత్ర. అధిరోహించి విజయం సాధించాడు హైదరాబాదీ పలపునూరి తులసీరెడ్డి . కుత్బుల్లాపూర్ అయిన బౌరంపేట గ్రామానికి చెందిన తులసీ రెడ్డి మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన 274 మందిలో ఒకరుగా ఉన్నారు. ఇందులో ముగ్గురు ఇండియన్లలో తానూ ఒక్కడై , తులసీరెడ్డి భారత్ పతాకతో పాటు తెలంగాణ కీర్తిని, హైదరాబాద్ షాను శిఖర స్థాయికి చేర్చాడు. అధిరోహణ క్షణాలు అతి తక్కువ. అయితే ఈ లక్ష సాధన దిశలో తులసీ రెడ్డి ఏండ్ల తరబడి పాటించిన క్రమశిక్షణ, పట్టువీడని శిక్షణ, అభ్యాసం, అలుపెరుగని సంసిద్ధత రాష్ట్రాలు ఎంతగానే ఆయనకు సహకరించాయి. పలువురు యువకులకు తులసీరెడ్డి సాహస కథ స్ఫూర్తిదాయకం అవుతోంది. ఒకప్పుడు భోజన ప్రియుడు అయిన ఈ యువకుడు తరువాత తనను తాను పూర్తిగా ధారుద్యంతో మలుచుకోవాలని అనుకుని సాధన చేశాడు. ఈ జిమ్లో విన్యాసాలు, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకున్నాడు. సాహస క్రీడలతో తనను తాను నిరూపించుకోవాలనే తపన చివరికి ఆయనను పర్వతారోహణ వైపు నడిపించింది. ఇప్పుడు ఎవరెస్టు దాకా చేర్చింది.
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పరుగు పందేలలో పాల్గొంటూ పట్టువీడని విక్రమార్కుడు అయ్యాడు. మార్కులు కొట్టేశాడు. పలు పోటీలలో సత్తా చాటారు. సవాలుకు సవాలుగా నిలిచే ఐరన్మాన్ ఛాలెంజ్ పోటీలో నిలిచాడు. ఇదే అనుకున్న ఎతైన చోట్లకు సాహసయాత్ర చేశాడు. మౌంట్ ఎల్బ్రస్, అకోన్కాగా, మౌంట్ కిలిమంజరో, కాంగ్ యాత్సేలను కూడా అధిరోహించాడు. ఇప్పుడు శిఖరాలలో శిఖర సమాన స్థాయిలో ఉండే ఎవరెస్టును బృందంతో కలిసి చేరుకుని సామూహిక శక్తిలో తాను సైతం అని తెలియచేసుకున్నాడు. తనకు ఈ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ఈ విజయం అంకితం అని సవినంగా ప్రకటించారు. తన కుటుంబం, తన షెర్పా టీం, గైడ్స్ భరత్ తమ్మినేని, రోమిల్ భరత్వాల్ ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తన కుటుంబానికి ఎవరెస్టు చేరిక గర్వకారణం అని చెప్పారు. సంవత్సరాల త్యాగం, కృతనిశ్చయం తనను ప్రపంచ శిఖరానికి చేర్చిందని ఆయన కంటే ఎక్కువ ఆయన కుటుంబ సభ్యులు ఖుషీ అయ్యారు.

