రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేన మంత్రి నారా లోకేష్ ఉన్నారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రతి ఇంటికీ వెళ్లి.. గడపగడపలోనూ వివరించాల్సిన అవసరం ఉందన్నారు. 2014-19 మధ్య స్వర్ణయుగం వంటి పాలనను గత ఎన్డీయే అందించారు. కానీ, 2019-24 మధ్య ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టించింది.
అరాచక పార్టీని అంతమొందించిన ప్రజాలు 151 మందిని 11 టీంగా మార్చేశారని లోకేష్. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగాలంటే.. అభివృద్ది జరగాలంటే.. గొడ్డలి పార్టీని శాశ్వతంగా సమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన చెల్లికి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని అన్న బాలుడిని కాల్చి చంపారని, డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారని.. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ పాలనలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోంది. లక్ష కోట్ల రూపాయలతో సీమను అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. చివరకు పులివెందుల నియోజకవర్గానికి కూడా నీరు అందించారని చెప్పారు. దేవుడి(తిరుమల)తో పెట్టుకున్న వారు ఏమయ్యారో చూస్తున్నామని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అరాచక పాలన మరోసారి రాకూడని చెప్పారు. దీనికిగాను పార్టీ కార్యకర్త, నాయకులు నడం బిగించాల’ని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రాచరం చేయాలన్నారు.
ఆనాడు టీడీపీ జెండా లేకుండా చేస్తామన్నారని.. వైనాట్ 175 అంటూ విర్రవీగారని లోకేష్ అన్నారు. కానీ, ప్రజలు వారిని టీం-11కు పరిమితం చేస్తూ తీర్పిచ్చారని తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు విరాట్ కోహ్లీ అని.. బౌలర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఆయనేనని లోకేష్ అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్ట’నీయ’మ’ని ఆనాడు వైసీపీ నాయకులు చెప్పార’ని.. కానీ, తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబును గెలిపించిన ఘనత ప’సుపు సైన్యనిదని లోకేష్ చెప్పారు.

