క్రికెట్ సిక్స్ డిస్టెన్స్ టెక్నాలజీ: టి20 ఫార్మాట్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాటర్లు బంతిని కొట్టే తీరు మారిపోయింది. ఫోర్ల కంటే కూడా సిక్సర్ లను అధికంగా కొట్టే ప్లేయర్లు ఎక్కువయ్యారు. ప్రొఫెషనల్ బ్యాటర్లు మాత్రమే కాదు.. కొన్ని సార్లు బౌలర్లు కూడా బ్యాటర్ల అవతారం ఎత్తుతున్నారు. బంతి కనిపిస్తే చాలు కసికొద్ది కొడుతున్నారు. దీంతో బంతి ఎక్కడో పడిపోతుంది. సిక్సర్ మీటర్ ను అవలీలగా దాటేస్తోంది
ఒకప్పుడు బ్యాటర్లు సిక్సర్లు కొడితే భారీగా ఎత్తువెళ్లి కింద పడితే దానిని గొప్పగా చెప్పేవారు. అప్పట్లో సిక్స్ వెళ్ళిన దూరాన్ని లెక్కించే పద్ధతి ఉండేది కాదు. ఆధునిక కాలంలో క్రికెట్ స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. ఆడే తీరు.. పరుగులు చేసే తీరు.. కనిపించడం.. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకమైపోయాయి. పరుగులు తీసే పరుగులనుంచి మొదలు పెడితే కొట్టే సిక్సర్ల వరకు కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఉంటోంది.
ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న తరుణంలో.. సిక్సర్లు కొట్టగానే అది ఎంత దూరం వెళ్లిందో వెంటనే తెలుస్తోంది. అయితే ఇది ఎలా జరుగుతుంది.. వెంటనే ఆ దూరాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు అనే డౌటు అందరిలోనూ వ్యక్తం అవుతుంది. మైదానంలో హై స్పీడ్ హాక్ ఐ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రతి సెకండ్ కు వందల మిశ్రమం తీస్తాయి. బంతి వేగాన్ని.. అది వెళ్లే కోణాన్ని వెంటనే గమనించవచ్చు. బంతి గ్యాలరీలోకి వెళితే.. ఫిజిక్స్ మోడల్ ఆధారంగా అది ఎక్కడ పడిందో వెంటనే అంచనా వేస్తారు. ఎల్బిడబ్ల్యు నిర్ణయాలకు కూడా ఈ టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నారు.
బంతి వెళ్లిన వేగాన్ని.. తాగిన దూరాన్ని వెంటనే చెప్పడం వల్ల అభిమానులలో కూడా ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. బ్యాటర్లలో కూడా పోటీ తత్వం ఎక్కువ అవుతుంది. అందుకే ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా సిక్సర్లు కొడుతున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

