తమిళనాట విజయ్ సినీ రంగానికి దూరం కావడంతో ఇండస్ట్రీలో ఒక శూన్యత ఆవహించిన పరిస్థితి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వయసు మీద పడడం.. అజిత్ ఇంతకుముందులా ఉత్సాహంగా సినిమాలు చేయాలనుకున్న టాప్ లీగ్‌లోకి వెళ్లడానికి తర్వాత రేంజ్ హీరోలకు ఇప్పుడు మంచి అవకాశం దక్కింది. గత కొన్నేళ్లలో చాలా వేగంగా మార్కెట్‌ను పెంచుకున్న హీరోల్లో శివకార్తికేయన్ పేరు ముందు వరుసలో ఉంటుంది.
ముఖ్యంగా ‘అమరన్’ సినిమా తన రేంజిని అమాంతం పెంచింది. ఆ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు. దాని తర్వాత శివ నుంచి వచ్చిన ‘పరాశక్తి’ సరిగా ఆడకపోయినా.. అతడి మార్కెట్ ఏమీ పడిపోలేదు. ఇప్పుడు శివ చేయబోతున్న ‘సెయాన్’ సినిమాతో ‘అమరన్’ స్థాయి హిట్ కొడితే.. అతను ఇంకా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. ‘అమరన్’ చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం విశేషం.
విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ‘సెయాన్’ ఈ రోజే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కాంబినేషన్లన్నీ చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ‘తాయ్ కిళవి’ అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.
‘తాయ్ కిళవి’తో శివకుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడు శివకార్తికే లాంటి టాలెంటెడ్ హీరోతో సినిమా చేయడం.. ఈ కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండడం విశేషం.
తన తొలి నాలుగు చిత్రాలు ఫ్లాపైనా తనకు అవకాశాలేమీ ఆగట్లేదు. తమిళంలోనూ ఆమె ‘కాంత’తో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ అందులో భాగ్యశ్రీ కెరీర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె జస్ట్ అందగత్తె కాదని, మంచి పెర్ఫామర్ అని ఈ సినిమాతో రుజువైంది. ఆ టాలెంట్ చూస్తే శివకార్తికేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడింది.

