- జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42% తక్కువ..
- గత 146 ఏళ్లలో జూన్ నెలలోనే అత్యంత పొడి వాతావరణం..
- దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ..
- దేశంలోని 166 ప్రధాన జలశయాల్లో 26% నీరు నిల్వ..
- ఉష్ణోగ్రతలు సగటు కంటే 5 నుంచి 12 డిగ్రీలు అధికం..
- 126 ఏళ్ల చరిత్రలోనే మూడో అత్యంత దారుణమైన అల్ప వర్షపాతం ..
- దేశంలో కేవలం 92.1 మిల్లీమీటర్ల వర్షపాతం ..
- 64 శాతం సాధారణ లోటు కేటగిరీ, మరో 14 శాతం భారీ లోటు..
Story Board : జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం రైతులను నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే రోజుల్లో దేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. 1950 తర్వాత అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ హెచ్చరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో వెరీస్ట్రాంగ్ ఎల్ నినోగా మారుతున్న తాజా బులెటిన్‌లో కనిపిస్తుంది. ఈ పరిణామం భారత్‌లో వర్షం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశానికి ఆహార సంక్షోభం, ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. చినుకు జాడ లేకపోవడంతో…ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. వ్యవసాయ రంగం కుంటుపడితే…అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో కరువు కమ్ముకొస్తోంది. సకాలంలో రుతుపవనాలు రా…చినుకు లేక రైతులు చిత్తయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థను ముంచెత్తబోతోంది. ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో యుద్ధం ప్రభావం వ్యవసాయ రంగం మీద పడటం…మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. అమెరికా-ఇరాన్ యుద్ధానికి కరువు తోడవడం…దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారుతోంది.
దేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాత సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణం జూన్ నెలలోనే ఉంది. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలో 76 శాతం వర్షపాతం లోటు, లేదంటే తీవ్ర లోటుగా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, 16 కోసం నిర్దేశించబడిన దేశంలోని ప్రధాన జలశయాలు 25 నాటికి జూన్ మొత్తం నిల్వ సామర్థ్యంలో 2 శాతాన్ని కలిగి ఉంది. నీటి మట్టాలు ఇందిరా సాగర్‌లో 14 శాతం, నాగార్జున సాగర్‌లో 5 శాతం, తెహ్రీలో 2 శాతం పడిపోయాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా ఆ నెలలో తుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలా వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నెలలో గత 126 ఏళ్ల చరిత్రలోనే మూడో అత్యంత దారుణమైన అల్ప వర్షపాతం నమోదైంది. సోమవారం నాడు కేవలం 92.1 మిల్లిమీటర్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం మాత్రమే నమోదైంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవి విస్తరించలేదని భారత వాతావరణ శాఖ ఉంది. దేశంలో 78 శాతం భౌగోళిక ప్రాంతంలో రుతుపవనాల లోటు ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ లోటును ఐఎండీ రెండు వర్గాలుగా వర్గీకరించింది. అందులో 64 శాతం సాధారణ లోటు కేటగిరీలో ఉండగా, మరో 14 శాతం భారీ లోటుగా స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి జూలై చివరి వరకు కొనసాగితే ఖరీఫ్ సాగు, జలశయాల మట్టాలు, నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం.. 1901 నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యంత దారణమైన ఏడాదిగా 2009గా నిలిచింది. అప్పట్లో కేవలం 87.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆ తర్వాత 1905లో 92.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది జూన్ నెల ఆ తర్వాతి ఆక్రమించనుంది. గతంలో 2014లో 93 మిల్లీమీటర్లు, 1926లో 97.4 మిల్లీమీటర్ల మేర జూన్ వర్షపాతం నమోదైంది. సాధారణంగా వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్ నెల సగటు వర్షపాతం 165 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్‌నినో ఎఫెక్ట్ భయాలతో…ఐడీ గత నెలలోనే తన దీర్ఘకాలిక రుతుపవనాల అంచనాను సవరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సగటు వర్షపాతం 90 పడిపోవచ్చని హెచ్చరించింది. ఈ వర్షభావ పరిస్థితులను దేశంలోని రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఐరోపాలో వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం పరిమితంగానే ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాలానుగుణ సగటు కంటే 5 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర ఆఫ్రికా నుంచి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు… మానవ ప్రేరిత వాతావరణ మార్పులతో మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ పరిశోధక బృందం ప్రదర్శన. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధానమని శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశంలో సాధారణంగా బలహీనపడిన నైరుతి రుతుపవనాలు త్వరలో మళ్లీ పుంజుకోనున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ, దత్తమైన మేఘాలు అలుముకుంటున్నాయి. రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా ఒడిశా బెంగాల్ తీరాల వైపు, తూర్పు భారతదేశంలో వర్షాలు కురిపించనుంది. ఆ తర్వాత రాబోయే వారాల్లో దీని ప్రభావం మధ్య, ఉత్తర భారత దేశాలపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారంలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా.. ఆ తర్వాత మాత్రం రుతుపవనాల్లో హఠాత్తుగా స్తబ్దత ఏర్పడింది. దీనివల్ల వర్షపాతం సాధారణ స్థాయి కంటే పడిపోవడమే కాకుండా, ఎండ తీవ్రత పెరుగుదల ఉష్ణోగ్రతలు ఎగబాకాయి. దేశంలో ఖరీఫ్ పంటల సాగుపై ప్రతికూల ప్రభావం చూపింది. సమయానికి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి వంటి ప్రధాన పంటల నాట్లు వేయడం కూడా బాగా ఆలస్యమవుతోంది.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో… సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్ నినో దశలో కొనసాగుతోంది, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈసారి ఎల్ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు పసిఫిక్‌లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్‌లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా తెలుగురాష్ట్రాలతోపాటు దేశమంతా విస్తరించింది. కానీ పరిస్థితులు చాలా ఉన్నాయి. వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్రలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. మహారాష్ట్రతోపాటు గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే..తెలుగురాష్ట్రాలు మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. గాలులు తప్ప వర్షం పడడం లేదు. ఆడపాదడపా కొన్ని చినుకులు పడి పోతున్నాయే తప్ప.. పెద్ద వానల్లేవ్. వర్షాకాలం ఆరంభమై నెలన్నర కావొస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకూ ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాబోయే రోజుల్లో తగినంత వానలు పడే సూచనలు కూడా లేవు. ఇప్పటికే డెడ్‌స్టోరేజికి చేరిన ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరువు కాటు తప్పదేమోనని ఆందోళన రైతుల్లో ఏర్పడింది.
కొన్నిచోట్ల రైతులు పొలాల్లో విత్తనాలు వేసిన మొలకలు రాలేదు. అక్కడ చోట్ల మొలిచినా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మరో ప్రాణహిత మినహా ఇతర ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరో వారం పది రోజుల పాటు తెలంగాణలో పెద్దగా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. అప్పుడప్పుడు.. శుభ వర్షం పడుతుందే తప్ప వారం పాటు భారీ వర్షాల ఊసే ఉండదని చెబుతోంది. జులై నెలలో రెండు వారాలు ముగిసినా…ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వానలు పడతాయనే నమ్మకంతో దుక్కులు దున్ని, విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు మొలకలు ఎండిపోతే దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రాంతాలలో నీరు లేక నారుమళ్లు ఎండిపోతుండగా, బావులు, బోర్లలో కూడా నీటిమట్టాలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

