భారతదేశం vs ఆఫ్ఘనిస్తాన్: న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో చరిత్ర సృష్టించబడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆఫ్ఘన్ జట్టుకు అస్సలు చాన్సే ఇవ్వకుండా.. ఇన్నింగ్స్, 300 పరుగుల హిరికల్ తేడాతో ఘన విజయం సాధించాడు. టెస్ట్ క్రికెట్లోనే భారత జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం.
గిల్, రాహుల్ సెంచరీల మోత:
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అద్భుతమైన ఆఫ్ఘన్ బౌలర్లను దంచికొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 రన్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 100 రన్స్‌తో సెంచరీ కొట్టి రచ్చ లేపారు. వీరిద్దరి సెంచరీల దాటికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల స్కోరుని ఆఫ్ఘన్ ముందు పెట్టింది.
మానవ్ సుతార్ మాయాజాలం.. 152కే ఆఫ్ఘన్ ఖేల్ ఖతం:
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇండియా నయా స్పిన్ సెన్సేషన్ మానవ్ సుతార్ చుక్కలు చూపించాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే మంచి కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తూ కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లు (6/33) పడగొట్టి ఆఫ్ఘన్ జట్టు నడ్డి విరిచాడు. సుతార్ స్పిన్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది.
ఫాలోఆన్‌లోనూ వాషింగ్టన్ దెబ్బ.. 112 రన్స్‌కే సరెండర్:
భారీ స్కోరు తేడాతో వెనుకబడడంతో భారత్ కెప్టెన్ గిల్ ఆఫ్ఘన్ టీమ్‌కు ఫాలోఆన్ ఆడే అవకాశం ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా ఫైట్ ఇస్తారేమో అనుకుంటే.. మన బౌలర్లు మళ్లీ చుక్కలు చూపించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మ్యాజిక్‌తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పనిపట్టాడు. సుందర్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక కేవలం 112 పరుగులకే చేతులెత్తేశారు.
మ్యాచ్ స్కోర్ బోర్డు:
* భారత్ తొలి ఇన్నింగ్స్: 564/8 (శుభ్‌మన్ గిల్ 126, కేఎల్ రాహుల్ 100)
* ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 152 పరుగులకు ఆలౌట్ (మానవ్ సుథార్ 6/33)
*ఆఫ్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 112 పరుగులకే ఆలౌట్ (వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు)
సుందర్ వికెట్ 😍
అతను పెద్ద హిట్ కోసం వెళ్తాడు, కానీ కనుగొంటాడు #కుల్దీప్ యాదవ్ వంటి లోతైన లో #వాషింగ్టన్ సుందర్ భారత్‌కు మరో కీలక వికెట్ తీశాడు 👏🇮🇳#INDvAFG | కేవలం పరీక్ష ➡️ డే 3 | ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం 👉 https://t.co/jzjg5vVQq5 pic.twitter.com/XVd3rvlzlb
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూన్ 8, 2026
ప్రారంభం నుండి ముగింపు వరకు 👏
న్యూ చండీగఢ్‌లో మరపురాని టెస్ట్ మ్యాచ్ ముగుస్తుంది #టీమిండియా ఒక ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో వారి అతిపెద్ద విజయాన్ని ఖాయం చేసుకుంది 🤍
స్కోర్‌కార్డ్ ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTబ్యాంక్ pic.twitter.com/RfmeJWSyh2
— BCCI (@BCCI) జూన్ 8, 2026

