ఇండియా SU-57 ఫైటర్ జెట్: ప్రపంచంలో తమదే అత్యాధునిక యుద్ధ విమానం అని అమెరికా ఎఫ్– 35 స్టెల్త్ విమానాల గురించి ప్రచారం చేసుకుంటోంది. ట్రంప్ కూడా వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తున్నాడు. అయితే తాజాగా ఇరాన్‌తో యుద్ధం సందర్భంగా ఇరాన్ ఎఫ్–35 యుద్ధ విమానాన్ని భుజంపైకి తీసుకెళ్లే లాంచర్‌తో కూల్చివేసింది. దీనితో ఎఫ్–35 ప్రచారంలో లోపాన్ని బయటపెట్టింది. ఈ విధంగా భారత్ అమెకా ఆధునియ యుద్ధ విమానాలకు దీటుగా రష్యాతో కలిసి సుఖోయ్ ఎస్‌యూ–57 యుద్ధ విమానాలను అభివృద్ధి చేసి, ఉమ్మడి ఉత్పత్తిని ప్రతిపాదించారు. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంచనుంది. ఎస్‌యూ–57 రష్యా మొదటి పూర్తి స్థాయి ఐదో తరం స్టెల్త్ ఫైటర్‌గా పరిగణింపబడుతుంది. దీన్ని అమెరికా ఎఫ్–22 రాప్టర్, ఎఫ్–35 లైట్నింగ్–2 విమానాలతో సమానంగా రూపొందించారు.
డిజైన్, ఇంజన్ సామర్థ్యాలు..
ఎస్‌యూ–57 సింగిల్ సీట్, రెండు ఇంజిన్లతో కూడిన బహుళ ప్రయోజనకర విమానం. ప్రస్తుతం శాటర్న్ ఏఎల్–41ఎఫ్1 ఇంజిన్లు ఉపయోగించబడుతున్నాయి. ఇందులో మరింత అధునాతనమైన ఏఎల్51ఎఫ్1 ఇంజిన్‌ను అంతర్గతంగా అప్డేట్ చేస్తున్నారు. రెండు ఇంజిన్ల వల్ల ఒకటి పని చేయకపోయినా విమానం సురక్షితంగా తిరిగి రాగలదు. ఇది ఎఫ్–35లోని సింగిల్ డిజైన్‌తో భిన్నమైన లాభం. ఆయుధాలను విమానం లోపల (స్టెల్త్ మోడ్‌లో), బయట కూడా మోసుకెళ్లవచ్చు. దీనితో గాలి నుంచి గాలి లక్ష్యాలు, గాలి నుంచి నేల లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యం ఉంది.
వేగం, సూపర్ క్రూయిజ్ ప్రయాణ సామర్థ్యం..
ఇది మాక్ 2.0 వేగాన్ని చేరుకునే సూపర్ సోనిక్ విమానం. గంటకు సుమారు 2,458 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఆఫ్టర్‌బర్నర్ లేకుండానే మాక్ 1.3 వేగంతో సూపర్ క్రూయిజ్ చేయగలదు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది, స్టెల్త్ లక్షణాలు మరింత మెరుగవుతాయి. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే దాదాపు 1900 కి.ల దూరం వరకు సరఫరా చేయగలదు. ఇది ఎఫ్–35 సాధారణ పరిధి (సుమారు 1,100 కి.మీ.) కంటే ఎక్కువ. అధునాతన రాడార్, సెన్సార్ వ్యవస్థలు దీనికి అదనపు బలం ఇస్తాయి.
స్టెల్త్ సామర్థ్యం, ఆధునిక వ్యవస్థలు..
ఆధునిక గాలి రక్షణ వ్యవస్థలకు తప్పించుకునేలా రూపొందించబడిన ఈ విమానం స్టెల్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు, సెన్సర్ ఫ్యూజన్ దీన్ని గగనతలంలో ఆధిపత్యం చలాయించేలా చేస్తుంది. అయితే, అమెరికా విమానాల మాదిరిగా అన్ని కోణాల్లోనూ పూర్తి స్టెల్త్ కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ధర తక్కువ, పని ఎక్కువ..
ఒక్కో ఎస్‌యూ–57 విమానం ధర సుమారు 35 నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. అదే సమయంలో ఎఫ్–35 ధర 80 నుంచి 100 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ తక్కువ ఖర్చు, ఉమ్మడి ఉత్పత్తి సాధ్యత భారత్‌కు ఆర్థికంగా, సాంకేతికంగా ప్రయోజనం. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి దోహదపడవచ్చు.
అమెరికా విమానాలతో పోలిక..
ఎఫ్–22 రాప్టర్ ఎయిర్ సూపిరియారిటీలో అత్యుత్తమం. అయితే ఎస్‌యూ–57 తక్కువ ధర, మంచి పరిధి, సూపర్ మెన్యూవరబిలిటీలో పోటీ పడుతుంది. ఎఫ్–35 లైట్నింగ్ 2 సెన్సార్ ఫ్యూజన్, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్లో ముందంజలో ఉంది. కానీ ఎస్‌యూ–57 రెండు ఇంజిన్లు, ఎక్కువ వేగం, సూపర్ క్రూయిజ్, తక్కువ ధరలో ఆధిక్యత చూపుతుంది.
మొత్తంమీద ఎస్‌యూ–57 వేగం, పరిధి, ఖర్చు, బహుళ ప్రయోజనాల్లో బలమైన ప్రదర్శన ఇస్తుంది. అయితే అమెరికా విమానాలు స్టెల్త్, ఏవియానిక్స్ ఇంటిగ్రేషన్‌లో ముందున్నాయి. భారత్‌తో జైంట్ డెవలప్మెంట్ జరిగితే రెండు దేశాలు సాంకేతికంగా లాభపడి, ఈ విమానాన్ని మరింత ఆధునికంగా మార్చవచ్చు. ఈ ప్రతిపాదన భారత వైమానిక దళం ఆధునికీకరణకు కీలకమైన అవకాశం.

