భార్య విద్య కోసం భర్త భూమిని అమ్మాడు: సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మంచితనానికి నేటి కాలంలో రోజులు లేవు. పైగా మంచి చేసిన వారి మీదనే నిందలు పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.. దీంతో మంచితనానికి.. మంచి మనుషులకు సమాజంలో గౌరవమే లేకుండా పోతుంది.
అది బీహార్ రాష్ట్రం.. ఆ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ టీచర్ గా ఎంపికైన ఆమె ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ సమయంలో తన కాలేజీ ఫ్రెండ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో వెళ్లిపోయింది. భర్తను వదిలేసింది. కొడుకుని కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
హాజీపూర్ చేరిన అమన్ అనే వ్యక్తికి ఒక మహిళతో పెళ్లయింది. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. భార్యను పై చదువులు చదివించి.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలిని ఆ భర్త సంకల్పించాడు. ఈ ఆమెను ఉన్నత చదువులు చదివేందుకు తన భూమిని కూడా అమ్మాడు. ఉన్నత చదువులు చదివిన ఆమె.. భర్త ఆశయాలకు తగ్గట్టుగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి.. తమ జీవితం బాగుపడుతుందని.. గొప్పగా తమ సంసారం వెలిగిపోతుందని అమన్ భావించాడు. కానీ అతని అంచనాలను భార్య తలకిందులు చేసింది.
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాగానే ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. వేరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తితో కాపురం చేస్తోంది. భర్తను వదిలేసింది. కుమారుడిని కూడా పట్టించుకోవడం మానివేసింది. అదే కాదు భర్త మీద తప్పుడు కేసులు పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, అమన్ కుమారుడు తన తల్లి నిర్వాకాన్ని పోలీసులతో చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. అయితే తన ఇష్టపూర్తిగానే బయటికి వెళ్లిపోయానని.. తన భర్త ఇబ్బందులు పెడుతున్నాడని.. వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

