నైరుతి రుతుపవనాలు కేరళ: మామూలు ఎండలు కావు. ఈసారి పాత రికార్డులు బద్దలయ్యాయి. సూర్యుడి దెబ్బకు సరికొత్తగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వడగాలులు తీవ్ర స్థాయిలో వీచాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. మండే ఎండలకు తోడుగా వడ గాలులు కూడా విపరీతంగా వీయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశం కేసి ఆశగా కనిపిస్తోంది. రోహిణి కార్తె కూడా ప్రవేశించడంతో వానదేవుడా వర్షం కురిపించు.. అంటూ దీనంగా వేడుకుంటున్నారు.
ఎల్ని నో హెచ్చరికలు.. ఇతరత్రా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో.. వానదేవుడు జనాల మీద కరణం చూపించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు రేపు తాకబోతున్నాయి. ఐదో రాయలసీమలో ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా మొత్తం విస్తరిస్తాయి. జూన్ 15 వరకల్లా ఆంధ్ర ప్రదేశ్ మొత్తం రుతుపవనాలు వచ్చేస్తాయి. రుతుపనాలు వచ్చినప్పటికీ ఒక వారం పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఎండలు బాగా కొట్టాయి కాబట్టి.. వర్షాలు కూడా అదే స్థాయిలో పడతాయి అని చెప్పలేమని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. కేరళ… రాష్ట్రాలు తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే రాష్ట్రంలో చాలావరకు ఎండలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ. ముఖ్యంగా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భీమిలి ప్రాంతంలో రెండు సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం ఎందుకు బలమైన ఉదాహరణ.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వచ్చే మూడు గంటల్లో విజయనగరం.. శ్రీకాకుళం.. జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి.. కృష్ణాజిల్లాలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. గంటకి 50 నుంచి 60 వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఎప్పటికైనా ప్రభావం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వర్షాలు స్థిరంగా కొనసాగుతాయా.. లేకుంటేనే కురిసి ముఖం చాటేస్తాయా.. అనే ప్రశ్నలకు వాతావరణ శాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఎల్ నీనో ప్రభావం వల్ల నీరు అవసరమయ్యే పంటలు కాకుండా… తక్కువ నీటిని వినియోగించుకునే పంటలను ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

