వైభవ్ సూర్యవంశీ: సూర్య వంశీ గురించి రోజుకు ఒక వార్త మీడియాలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతడు సెలబ్రిటీ. పైగా దూకుడు మీద ఆడుతున్నాడు. శ్రీలంక సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగే రకం. ఐపీఎల్ లో తన సత్తా ఏమిటో చూపించాడు. కొత్తగా తనకు తాను ప్రూఫ్ ఏమీ లేదు. అయితే శ్రీలంక మైదానాలు అంత పట్టు లేకపోవడంతో సూర్య వంశీ.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.
సూర్యవంశీ కి మటన్ అంటే చాలా ఇష్టం. గత ఐపిఎల్ లోనే దాన్ని పూర్తిగా మానేశాడు. డైట్ మొత్తం వేరే విధంగా మార్చుకున్నాడు. ప్రత్యేకంగా డైటీషియన్ ను నియమించుకున్నాడు. దాదాపుగా తన కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మటన్ మానేసిన తర్వాత సూర్య వంశీ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. సింగిల్స్ తీయడంలో కూడా నేర్పరితనాన్ని చూపిస్తున్నాడు.
వైభవ్ సూర్య వంశీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి. అదే అతడి శ్రమ. ఇప్పుడు అతడు ప్రతిరోజు 600 పైగా బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతంలో కూడా అతడు ఇదే స్థాయిలో ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు తన ప్రాక్టీస్ మరింత పెంచాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు మైదానంలో మునిగి తేలుతున్నాడు. అందువల్లే అతడు భారీగా పరుగులు చేయగలుగుతున్నాడు. శ్రీలంక మైదానాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుత సిరీస్లో అంతగా పరుగులు చేయలేకపోతున్నాడు. కాకపోతే అతడు త్వరలోనే మళ్లీ పూర్వపు లయలోకి వస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సూర్య వంశీ గతంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని తల్లి అర్ధరాత్రి రెండు గంటలకు లేచేది. అతనికి భోజనాన్ని సిద్ధం చేసేది.. తండ్రి దాదాపు రెండున్నర గంటలు నిద్రపోయేవాడు. ఆ తర్వాత వాళ్లు కోచింగ్ సెంటర్లోకి వెళ్లి పోయేవారు. కొడుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రాక్టీస్ చేస్తుంటే తండ్రి అక్కడే ఉండేవాడు. అతని కుమారుడి ఆట తీరు పరిశీలించేవాడు. ఇంత శ్రమ పడ్డాడు కాబట్టే.. సూర్య వంశీ ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
సూర్యవంశీ ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం వెనుక అతడి ప్రాక్టీసే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అతడు ఆడే విధానం ఇంత గొప్పగా ఉండడానికి ఆట మీద మక్కువ కారణమని వివరిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో అతడు తేలిపోతాడని.. అతని చేతుల్లో సెక్యూర్డ్ గా ఉంటుందని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

