మణిపూర్: మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఉఖ్రుల్ షెడ్యూల్ నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల కాల్పులు జరపడంతో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కొనసాగుతున్నాయి.
దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖండించారు. ఇలాంటి దాడులు శాంతిభద్రతలను కాపాడాలంటే ప్రభుత్వం సంకల్పాన్ని బలహీనపరచలేవని అన్నారు. బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని హోం మంత్రి గోవిందాస్ కొంథౌజం అన్నారు. మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో కొత్తగా అస్సాం రైఫిల్స్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆదివారం నిరసనకారులు, భద్రతా సిబ్బందిపై ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు పౌరులు గాయపడ్డారు.
మే 2023లో మైతేయ్, కుకీ జో వర్గాల మధ్య జాతి హింసతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. భద్రతా బలగాలు ఆ రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతి ఘర్షణల్లో ఇప్పటి వరకు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

