ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతంలో మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు ఉపాధి, వారికి స్థానికంగానే మెరుగైన, ఆర్థిక అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వం ముందు ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాల కంటే కూడా అన్నదాతలు, మత్స్యకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమని, గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన మరోసారి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే, మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతూ వరుసగా రెండో ఏడాది కూడా ఃమత్స్యకార సేవలో పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసింది. ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అత్యంత స్పష్టంగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడానికి పవన్ కల్యాణ్ వివరించారు. తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా భవిష్యత్తులో వలసలను పూర్తిగా అరికట్టేలా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు.

