తెలంగాణ:అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం( అక్రమ రవాణా నిరోధక దినోత్సవం ) సందర్భంగా నషా ముక్త్ అభియాన్ లో భాగంగా నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.
మదకాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు,సమాజ శాంతి భద్రతలకు,యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని సూచిస్తున్నారు.నేటి సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు,యువతను లక్ష్యంగా చేసుకుని మదకాలి ద్రవ్య వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పారు.
మదక ద్రవ్యాల బారిన పడిన యువత విద్య,వృత్తి, కుటుంబ బంధాలు, ఆరోగ్యం నిలుపుదల కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రత్యేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంపు అత్యవసరం అని ఆయన, మదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక,ఆర్థిక,సామాజిక దుష్ప్రభావాలు,డ్రగ్స్‌కు అలవాటు పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు,కుటుంబ సభ్యులు, స్నేహితులు గమనించాల్సిన ముందస్తు హెచ్చరిక సంకేతాలు,వంటి విద్యార్థులకు అవగాహన కల్పించారు.“మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు చీకటిమయం అవుతుంది.
డ్రగ్స్‌కు కుటుంబానికి ఆనందం, సమాజానికి భద్రత” అని తెలియజేసారు.యువత మాదక వ్యతిరేక పోరాటంలో ముందుండాలని,తమ స్నేహితులను కూడా ఈ దుష్ప్రవర్తన నుంచి దూరంగా ఉంచాలని.
అలాగే విద్యార్థులు,యువత ఎవరైనా మాదక ద్రవ్యాల విక్రయం,రవాణా, వినియోగానికి ప్రోత్సహించడం, అనుమానాస్పద విద్యాసంస్థల పరిసరాల్లో తిరగడం వంటి విషయాలు గమనించిన వెంటనే 8712670266 గాని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులు “డ్రాగ్స్కు నో-ఆరోగ్యకరమైన జీవితానికి యస్”, “మాదక రహిత సమాజ నిర్మాణానికి మనందరం కావాలి” అనే సందేశాన్ని స్వీకరించారు.కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల మదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంజిరెడ్డి,ఎస్బీ సీఐ ఆది రెడ్డి,నార్కట్ పల్లి సీఐ సురేష్,ఎస్ఐ విష్ణు,అధ్యాపకులు,విద్యార్థులు ఉన్నారు.


