కెనడా వీధుల్లో వేలాది మంది ఇండియన్స్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో రచ్చ రేగుతోంది. ఒకేసారి వేలాది మంది గానా భజానాతో వీధుల్లో చేసిన కోలాహలం మనోళ్లకు వేడుకలా ఉంటే.. అక్కడి స్థానికులకు చిరాకు తెప్పించిన పరిస్థితి. గో బ్యాక్ ఇండియన్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమానికి దారితీసేలా తయారైంది.
భారత వలస వాదులు మా దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. మా దేశం ఒక్కటే కాదు.. పశ్చిమ దేశాలను కబ్జా చేస్తున్నారు. టొరంటో వీధిల్లో కల్చర్ ఈవెంట్స్ పేరుతో ఇండియన్స్ చేసిన రచనే అందుకు ఉదాహరణ. కెనడా మొత్తం ఇండియన్స్ కాలనీలా మారిపోయింది. ఇలా కావడానికి ఒప్పుకోం.. అంటూ కెనడియన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
- సోషల్ మీడియాలో దుమారం:
కెనడాపై ఇండియన్స్ దండయాత్ర. వీధులన్నీ ఇండియన్స్ కాలనీలు అయిపోయాయి.. వలసవాదులతో టొరంటోలో కెనడియన్లు మైనారిటీలుగా మారుతున్నారు. మేలుకో కెనడా.. మేలుకో.. అంటూ పెట్టిన పోస్టు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. పెద్ద చర్చ నడుస్తోంది. పోలరైజ్డ్ రియాక్షన్స్ తో దుమారం రేగుతోంది.
ఇండియన్స్ చేసిన ఈవెంట్ ను విమర్శించే వారు.. చాలా ఆగ్రహానికి ప్రయత్నించారు. ఎందుకు ఇండియన్స్ వాళ్ల స్థానిక సంస్కృతిని విదేశాలలో రుద్దాలని చూస్తున్నారు. స్థానిక కల్ కు అనుకూలంగా జీవించడానికి బదులు.. వాళ్ల దేశ శిక్షణను ఇక్కడ రుద్దాలనుకోవడం.. సెలబ్రేషన్స్ పేరుతో ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.
కెనడా ఇండియన్స్ మద్ధతుగా చాలా మంది ఇండియన్స్ డిబేట్ కు దిగారు. మా వాళ్లు హార్డ్ వర్కింగ్ చేసేవాళ్లు. కావాలని టార్గెట్ చేస్తున్నారు. కెనడా కేవలం వలస వాదుల చెమటతోనే నిర్మితమైందని అన్నారు. ట్యాక్సులు కడుతూ.. ఇక్కడ లేబర్ లేకపోతే దాన్ని భర్తీ చేస్తూ కెనడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ రిప్లై ఇస్తున్నారు.
గ్లోబల్ హబ్స్ గా పేరొందని ప్రధాన దేశాలలో కేంద్రాలలో ఆర్థిక ఇబ్బందులు, జనాభా ఘర్షణలకు కారణం ఈ పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది. ఈ డిజిటల్ ఘర్షణ వాతావరణంలో ఆందోళనలను అద్దం పడుతోంది. కెనడాకు మల్టీ కల్చర్డ్ కంట్రీగా పేరు కనిపిస్తుంది.. ఈ వైరల్ సంఘటన, మైనారిటీ వర్గాల పట్ల పెరుగుతున్న శత్రుత్వ ధోరణి ఏంటో వెల్లడిస్తోంది.
కెనడా భారతీయ కాలనీగా మారిపోయింది!!!!
కెనడియన్లు ఇప్పుడు టొరంటోలో మైనారిటీలుగా ఉన్నారు మరియు వలసదారుల వరద గతంలో కంటే ఎక్కువగా ఉంది.
ఇది మనకు జరగనివ్వదు. మేలుకో!!!! pic.twitter.com/TIxnzuLeS7
— Știrile Rezistenței 🇷🇴 🇷🇺 (@RomaniaMare1918) జూన్ 2, 2026

