అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న మమత బెనర్జీకి మరో తలనొప్పి వచ్చింది. శాసనసభ్యుల సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. కోల్‌కతా 30డి, హరీష్ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందం అక్కడకు వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ. ఆమె ఇంటి చిరునామాతో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక పార్టీ కార్యాలయం కూడా నమోదై ఉన్నందున తాము ప్రాంగణాన్ని తనిఖీ చేయాలని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే, మాజీ ఎంపీ సుభాషిష్ చక్రవర్తితో సహా పలువురు టీఎంసీ నాయకులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో నివాసం వెలుపల కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.
మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇద్దరూ ప్రస్తుతం ఇంట్లో లేరని, కాబట్టి సోదాలకు అనుమతి లేమని, ఒకరోజు రోజుల తర్వాత రావాలని సుభాశిష్ చక్రవర్తి ఉన్నారు. అయితే, తాము చట్టప్రకారం విచారణకు వస్తే అడ్డుకోవడం నేరమని స్పష్టం చేశారు సీఐడీ అధికారులు. కొద్దిసేపు ఘర్షణ తర్వాత సీఐడీ బృందం లోపలికి వెళ్లింది.
మే 20న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు తృణమూల్ కాంగ్రెస్ తరపున ఒక లేఖ సమర్పించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్ దేబ్ ఛటోపాధ్యాయను ఎన్నుకుంటూ ఈ లేఖను ఇచ్చారు. అయితే ఈ లేఖపై ఉన్న తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ టీటీడీ ఎమ్మెల్యేలు రితబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ముదిరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
ఈ ఫోర్జరీ వ్యవహారంపై కోల్‌కతాలోని హెర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. స్పీకర్‌కు పంపిన ఆ వివాదస్పద లేఖపై పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ సంతకం చేసినందున, విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే, అనారోగ్య కారణాలను చూపుతూ అభిషేక్ బెనర్జీ వ్యక్తిగతంగా హాజరుకాకుండా.. తనకు 15 రోజుల సమయం కావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ నేరుగా మమతా బెనర్జీ ఇంటికి రావడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

