లెనిన్ విడుదల తేదీ: ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత , బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్, ‘లెనిన్’ చిత్రంతో ఈ నెల 25న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో బోలెడన్ని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. కాకుండా అఖిల్ ఈ చిత్రం లో చాలా అద్భుతంగా నటించాడని , ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి అఖిల్ ఈ సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాడని, ఇక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలాంటి సినిమా ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ముందుగా ఈ మేడే సందర్భంగా ‘మే 1’ విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుందని ఇప్పటికే ఆ చిత్ర మేకర్స్ అధికారిక ప్రకటన , అఖిల్ కి రామ్ చరణ్ తో ఉన్నటువంటి అనుబంధానికి విలువ ని ఇస్తూ, మా ‘లెనిన్’ స్టోరీ జూన్ 25 కి వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు. కానీ అసలు నిజం అది కాదు, సినిమా ఇంకా పూర్తి కాకపోవడం వల్లే వాయిదా పడిందని ఇప్పుడు అర్థం అవుతోంది. ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం ఈ సినిమా జూన్ 25 న కూడా విడుదల కావడం లేదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా సమయం తీసుకుంటుందని , కొన్ని VFX షాట్స్ డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉందని , ఇప్పటి వరకు అవి డెలివరీ అవ్వలేదని అంటున్నారు.
అంతే కాకుండా ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి అవ్వలేదట. కేవలం ఫస్ట్ హాఫ్ ని మాత్రమే ఇప్పటి వరకు లాక్ చేసినట్టు సమాచారం. రీ రికార్డింగ్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అందుకే ఈ జులై కి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ ప్రముఖ నిర్మాత వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్నర్ బ్యాన పై నిర్మించుండగా , అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం పంచుకుంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడం తో , ఆమె స్థానంలోకి భాగ్యశ్రీ ని తీసుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ గుడ్డివాడిగా నటించబోతున్నాడని టాక్.

