నేడు రెండోరోజు మహానాడు జరుగుతుంది. హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న మహానాడులో నేడు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. నిన్న ప్రారంభమైన మహానాడు నేటితో ముగియనుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు మహానాడులో తొలుత పార్టీ వ్యవస్థాపకుడికి నివాసులర్పించిన అనంతరం మహానాడు కార్యక్రమం జరిగింది.
కీలక తీర్మానాలు…
నేడు రెండోరోజు టీడీపీ మహానాడు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. నేడు మహానాడులో కీలక తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించిన తీర్మానాలను నేడు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. చంద్రబాబు ముగింపు ఉపన్యాసం సాయంత్రం ఉండనుంది.

