మహిళలు టేకు ఆకుల సేకరణ కోసం సందర్శించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద పులి నక్కి ఉంది.
మహారాష్ట్ర టైగర్ ఎటాక్: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. పులి పంజా విసిరింది. దాడికి దిగింది. ఈ ఘటనలో ఏకంగా నలుగురు మహిళలు చనిపోయారు. మృతులను కవదు బాబు (45), అనుబాయి (46), సంగీత (36), సునీత (33)గా పేర్కొన్నారు. మృతులది చంద్రపూర్ జిల్లా సిందేవహి తాలూకా గుంజావాహి. సిందేవాహి తాలూకా గుంజావాహి సమీపంలోని ఖైరి శివారు ప్రాంతంలోని అడవిలో ఈ ఘటన జరిగింది.
మహిళలు టేకు ఆకుల సేకరణ కోసం సందర్శించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద పులి నక్కి ఉంది. మహిళలపై దాడి చేసింది. పులి దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నలుగురు మహిళలు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మనుషుల ప్రాణాలు బలితీసుకున్న పులిని పట్టుకోవడానికి గాలింపు కొనసాగుతోంది. కాగా, చంద్రపూర్ జిల్లాలో తరుచూ పులుల దాడుల్లో మనుషులు చనిపోతున్నారు. తాజా ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ కోవిడ్ వస్తోందా..? భారీగా పెరుగుతున్న కేసులు.. వారంలోనే 60 శాతం పెరుగుదల.. అక్కడ హైఅలర్ట్..

