తెలంగాణ:హైదరాబాద్ సిటీలోని హోటళ్లు,మాల్స్,హాస్టళ్లు,సినిమా హాళ్లు,విద్యా సంస్థలతో పాటు.వ్యాపార,వాణిజ్య సముదాయాల్లో మహిళల ఆత్మగౌరవానికి,వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు కోసం హైదరాబాద్ పోలీసు విభాగం సరికొత్త అస్త్రం షీ నేత్రను ( She Netra Teams )రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ‘షీ నేత్ర’ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.ఏప్రిల్ -10న సిటీ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక షీ నేత్ర టీమ్‌లు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు.
అందులో భాగంగా అత్యాధునిక కెమెరాలు,డిటెక్టర్ల వినియోగం,నిబంధనల ఎస్‌వోపీపై రెండు దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు.ఈ షీటీమ్స్ బృందాలు షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్‌లు,ఆస్పత్రులు, హోటళ్లు,హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతోంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీపీ తెలిపింది.
ప్రతి సంస్థ తప్పనిసరిగా ‘కస్టమర్’ సేఫ్టీ ఇన్ చార్జీని నియమించాలని,వీరు షీ టీమ్స్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించారు.మహిళల భద్రతా సమిష్టి బాధ్యతని, ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులను గుర్తిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ నంబర్ 9490616555కు సమాచారం అందించాలని సూచించారు.

