ఒక మహిళ దుస్తులు లాగటం, ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం ‘అత్యాచార యత్నం’ కిందకు రాదంటూ పాట్నా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాల కిందికే వస్తుందని చెప్తూ, అత్యాచార యత్నం కేసులో ఒక నిందితుడికి పడిన శిక్షను పాట్నా హైకోర్టు రద్దు చేసింది.
ఈ పరీక్ష సీనియర్ న్యాయవాది శోభా గుప్తా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులు ఇలాంటి విచిత్రమైన తీర్పులు తరచుగా జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 9న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు సరిగ్గా పరిశోధన చేసి, పాత సుప్రీంకోర్టు తీర్పులను మనసులో ఉంచుకుని మాట్లాడాలని సూచించింది.
సుప్రీం ఆదేశాలు:
*కోర్టులన్నీ ఇలాంటి కేసుల్లో ఇచ్చే నియమ నిబంధనల పుస్తకాన్ని (హ్యాంబుక్) కచ్చితంగా పాటించాలని సూచించింది.
*పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు, ఛార్జిషీట్ వేసేటప్పుడు కూడా ఈ నిబంధనలను పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
*లైంగిక నేరాల కేసుల్లో న్యాయమూర్తులు ఎలా వ్యవహరించాలనే దానిపై ‘నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ’ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్రంగా విచారించింది, ఇలాంటి రెండు కేసులను స్వయంగా (సుమోటోగా) విచారణకు స్వీకరించింది.
గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు:
గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి వివాదస్పద తీర్పులే ఇచ్చింది. ఒక కేసులో, చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి లాకెళ్లడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కిందికి రాదని పేర్కొంది.
మరో కేసులో, రేప్ కేసు నిందితుడికి బెయిల్ ఇస్తూ.. “బాధితురాలు మద్యం సేవించి నిందితుడి ఇంటికి వెళ్లడం వల్లే ఈ సమస్యను కొనితెచ్చుకుంది” అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

