ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని అభిమానుల్లో క్యూరియాసిటి మొదలైంది.
గతంలో రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసి తనదైన ప్రయత్నం చేశారు. కానీ నటుడిగా ఆయన కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. అయితే తన కొడుకును ఒక మంచి హీరోగా చూడాలంటే రమేష్ బాబు పెద్ద డ్రీమ్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఇప్పుడు తండ్రి కలని నిజం చేస్తూ, ఘట్టమనేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జయకృష్ణ తన భుజాలపై వేసుకున్నాడు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడంతో స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే జయకృష్ణ మొదటి సినిమా కోసమే చాలా హార్డ్ వర్క్ రూపొందించారు. బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఒక మాస్ హీరోకి కావాల్సిన లుక్స్ ను బాగానే మేనేజ్ చేశాడు.
ఈ సినిమాకు అజయ్ భూపతి లాంటి రాక్ డైరెక్టర్ తో పాటు వైజయంతీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్ తోడు కావడం ప్లస్ పాయింట్. అలాగే మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా కనిపించనుండటం మరో హైలెట్. బాబాయ్ మహేష్ బాబు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక వారసత్వం అనేది మొదటి సినిమా ఓపెనింగ్స్ వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడాలన్నా, కెరీర్ లాంగ్ రన్ సాగాలన్నా కచ్చితంగా కంటెంట్ లో దమ్ముండాలి.
జయకృష్ణ ఎంచుకునే రూట్ కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే జోనరే అయినప్పటికీ, థియేటర్లలో ఆడియన్స్ ఎమోషన్ దాన్ని ఎంతవరకు కనెక్ట్ అవుతారనే బట్టే అసలైన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రమేష్ బాబు ఆశయాన్ని నెరవేరుస్తూ వస్తున్న ఈ ఘట్టమనేని కుర్రాడు మొదటి సినిమాతోనే ఒక్క సాలిడ్ హిట్ అందుకోవాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ‘శ్రీనివాస మంగాపురం’ జయకృష్ణ కెరీర్ కు ఎలాంటి స్టార్టింగ్ ఇస్తుందో చూడాలి.

