ఏజ్ గ్యాప్ రిలేషన్ షిప్స్: ఏమైంది ఈ నగరానికి.. ఏమిటి ఈ దుమ్ము.. ఈ ధూళి..ఎవరూ నోరు మెదపరేంటి.. ఈ నిర్లక్ష్యానికి పాడాలి చరమగీతం.. సినిమా ప్రారంభంలో ఈ యాడ్ మనం చూస్తేనే ఉంటాం. యువతరానికి.. మధ్య వయసు ఉన్న వారికి కాస్త అనుకూలంగా మార్చుకుంటే.. దీని అర్థం మారిపోతుంది.. అది ఎలా ఉంటుందంటే.. ఏమైంది.. మధ్య వయసు.. ఈ సంబంధాలు ఏమిటి.. ఈ వ్యవహారాలు.. సరైన ఈడు జోడు కాకుండా.. ఈ ఆంటీల వారికి ఎందుకు పెళ్లి అవుతుంది.. వాళ్లనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు.
ఆమధ్య ఉత్తర ప్రదేశ్లో 20 సంవత్సరాల అబ్బాయి.. 40 సంవత్సరాల మహిళతో రిలేషన్ ప్రారంభించాడు. ఆమె భర్త వీరిద్దరి వ్యవహారాన్ని పోలీసులు దాకా తీసుకెళ్లాడు. అయినా ఆ అబ్బాయితోనే ఉంటానని బెట్టు చేశాడు. ఎంత చెప్పినా వినలేదు.. ఆమె కూడా అతడి మాయలో ఉండటంతో.. రెండు కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోయారు. చివరికి వదిలేసారు. వారిద్దరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు. 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల మహిళ, 35 ఏళ్ల మహిళ 27 ఏళ్ల వ్యక్తి.. 35 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల మహిళ.. చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో జరిగిన ఎన్నో సంఘటనలు.. సరైన ఈడు, జోడుతో కనిపించాల్సిన ఈ కాలపు పిల్లలు ఇలా మారిపోవడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. అలాగని ఈ బంధాలు మధ్యలోనే ఆగిపోవడం లేదు. పరిపక్వతతో సాగుతున్నాయి. కొందరైతే కేవలం డబ్బు కోసమే ఆ తరహాలో చేస్తున్నారు. తిరుపతిలో ఓ వ్యక్తి భర్తను కోల్పోయిన ఒక మహిళకు దగ్గరయ్యాడు. ఆమె డబ్బు మొత్తం తీసుకుని.. మోసం చేశాడు.. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
నేటి కాలం అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు. వారికి ఆర్థిక స్వాతంత్రం కూడా అధికంగా ఉంది. అలాంటప్పుడు భర్త సంపాదన మీద లేదా భర్త అజమాయిషీలో ఉండాలని అనుకోవడం లేదు. అటువంటి వారితో నేటితరం అబ్బాయిలు సంసారం సరిగా చేయలేకపోతున్నారు. ప్రతిసారి ఎదురవుతున్న గొడవలు.. ఇలాంటి సంసారం అవసరమా. అందువల్లే వయసులో పెద్ద మహిళలను ఇష్టపడుతున్నారు. వారిలో మెచ్యురిటీ ఉంటుందని.. ఖర్చులకు అంతగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని.. పైగా పరిపక్వతతో ఆలోచిస్తారని.. అలాంటి వారితో గొడవలు జరగకపోగా.. మానసికంగా ప్రశాంతంగా ఉండే అబ్బాయిలు. అందువల్ల ఇటువంటి బంధాలకు ఓటేస్తున్నారు. చాలావరకు నేటి కాలంలో ఇటువంటి రిలేషన్స్ కొనసాగుతున్నాయి.
అయితే ఈ బంధాలు మొత్తం అన్ని గొప్పగా సాగుతున్నట్టు లేవు. కొన్ని మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బు కోసం అలవాటు పడి.. నమ్మి వచ్చిన మహిళలను ముంచేస్తున్నారు. లేదా వాటికి దారుణంగా చేస్తున్నారు. అయితే ఇటువంటి బంధాలు యువత బాగుంటాయని.. ఆ తర్వాత మొదటికే మోసం వస్తుంది.. కాబట్టి అలాంటి వాటిపట్ల ఆకర్షితులు కాకుండా ఉండడమే మంచిదని నేటికి మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.

