నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో జగన్ హయాంలో ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. తాజాగా రాజకీయాలను గమనిస్తే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్నా జిల్లా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక జిల్లా మొత్తం తన కనుసన్నల్లోనే ఉందని చెప్పుకోగా మరొకరు రెడ్డి సామాజిక వర్గం అంతా తాను చెప్పినట్టే నడుస్తుందని బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.
అయితే.. వీరిలో ఒకరు సైలెంట్ అయిపోగా మరొకరు అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. తాజాగా డీఎస్సీ విద్యార్థులకు అన్యాయం ఆరోపిస్తూ వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఈ సందర్భంగా తామే విజయవంతం చేశామని చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైపి పిలుపునిచ్చింది.
అయినప్పటికీ కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు ఈ కార్యక్రమాలు చేశారు. కానీ, ఇద్దరూ తమవల్లే జిల్లాల్లో వైసిపి నిరసన విజయవంతం అయిందని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి అందరూ కలిసి ఉమ్మడిగా నిరసన విజయవంతం చేశామని చెప్పుకుంటే ఒక రకంగా ఉండేది. కానీ, దీనికి భిన్నంగా తమ వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని ఒకరికొకరు సెల్ఫ్ గోల్ చేసుకోవడం గమనార్హం.
అంతేకాదు.. తమ వల్లే పార్టీ నిలబడుతుందని చెప్పడం ఆసక్తిగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. మరి ఇది పార్టీ కార్యకర్తల్లో విభేదాలకు, విభేదాలకు కూడా దారి తీసే పరిణామంగా చెబుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రులుగానే కాకుండా బాధ్యతాయుతమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులుగా వ్యవహరించాలి. చిన్న పాటి కార్యక్రమాలకే సెల్ఫ్ గోల్ రాజకీయాలు చేసుకుంటే భవిష్యత్తులో కార్యకర్తలు దూరం అయ్యే ప్రమాదం ఉంటుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

