వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య పోలీసులకు లొంగిపోయారు. గత కొన్నాళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న చిన్న మల్లయ్య తనకు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించాడు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు.
మహిళపై అత్యాచారానికి…
ఒక మహిళ తనపై చిన్న మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార ఆరోపణల కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ సీఐ చిన్నమల్లయ్య నెల రోజుల తర్వాత వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇటీవలే ఆయనను నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఐజీ ఉద్యోగానికి ఉత్తర్వులు జారీ చేశారు.

