మా ఇంటి బంగారం కలెక్షన్స్: స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వనటువంటి అరుదైన రికార్డ్స్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజం, అది పాజిటివ్ టాక్ వచ్చినా సరే. కానీ ముందు రోజు తో ఒక్క శాతం కూడా డ్రాప్ అవ్వకపోవడాన్ని గమనించవచ్చు. వివరాల్లోకి వెళ్తే ఈ పూర్తి వివరాలు 11వ రోజున , అనగా సోమవారం రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 12 వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్.
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 11 వ రోజు కంటే 12 వ రోజునే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 11 వ రోజున 2 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు రాగా, 12 వ రోజున 2 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ రేట్స్ పై ఆఫర్లు ఉంటాయి. అందుకే ముందు రోజుతో ఆరోజున ఎక్కువ వసూళ్లు నమోదు అవుతుంటాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం 13 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఆంధ్ర ప్రదేశ్ నుండి 9 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం 22 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, 44 కోట్ల 15 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే తమిళనాడు నుండి 1 కోటి 82 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తమగు 39 కోట్ల 58 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 80 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. లాభాల సంఖ్య 27 కోట్ల 58 లక్షలకు చేరింది. భవిష్యత్తులో ఈ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

