మా ఇంటి బంగారం 13 రోజుల కలెక్షన్స్: సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ , చాలా సాలిడ్ మూడవ వీకెండ్ ని సూచిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ రేంజ్ స్టడీ రన్ ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడా రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ బలం వల్లే , ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రేపు విడుదలయ్యే కొత్త సినిమాల్లో ఒక్క దానికి సూపర్ హిట్ టాక్ వచ్చినా , ‘మా ఇంటి బంగారం’ వసూళ్లపై కాస్త ప్రభావం పడొచ్చు. అలా కాకుండా , ఫ్లాప్ టాక్ , లేదా డివైడ్ టాక్ వస్తే మాత్రం ఈ వీకెండ్ ని కూడా ‘మా ఇంటి బంగారం’ దంచి కొట్టేస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
వారు అందించిన సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం 11 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా , 12 వ రోజున కూడా 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చుకుంది. ఇక 13 వ రోజున అయితే కేవలం 10 లక్షల రూపాయల డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 75 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి స్టడీ రన్ స్టార్ హీరోలకు కూడా దక్కలేదు , అందుకు రీసెంట్ ఉదాహరణ పెద్ది. ప్రాంతాల వారీగా ఈ చిత్రం వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఇక ఆంధ్ర ప్రాంతం నుండి 10 కోట్ల 21 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం 23 కోట్ల 61 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 45 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 84 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 90 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 40 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 82 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. లాభాలు 28 కోట్ల 55 లక్షల వరకు వచ్చాయి, పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది.

