పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది.’కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం.
యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది”అని అన్నారు.దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెబుతూనే వచ్చాను. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక సినిమాలో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. పెట్టిన 9 కోట్ల గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయ స్థాయిలో నిలబెట్టారు”అని అన్నారు.

