న్యూఢిల్లీ: తమ పార్టీ ఢిల్లీలో అధికారం ఉన్న పదేళ్లపాటు ఎటువంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ లీక్‌లు మొదలయ్యాయని ఆయన ఆక్షేపించారు. తరచూ తలెత్తుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ గురించి ఆయన మరోసారి ప్రస్తావించారు. ప్రశ్నపత్రాల లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారాలు నడుస్తున్నాయని, ఇందులో చాలా పెద్ద వ్యక్తుల హస్తం ఉందని. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రతి మూడేళ్లకు ఒకసారి పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఒక్క లీక్ కూడా జరగలేదు. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో గతంలో తెలంగాణలో బ్యాన్ చేసిన కోఎంప్ట్ (గ్లోబరీనా) కంపెనీకే సెంటర్ సీబీఐసఈ 12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎసఎం) ప్రక్రియ కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ జరిగింది. ఆ కంపెనీ తెలంగాణలో సృష్టించిన సమస్యల వల్ల 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అటువంటి కంపెనీకి ఇంత పెద్ద సీబీఐసఈ కాంట్రాక్ట్‌ను ఇవ్వడం వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగిన ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని దేశ యువతకు కేజ్రీవాల్ ఉంది. పేపర్ లీక్‌లను అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకునే విద్యార్థులు, పౌరులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేంత వరకు ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుందన్నారు. రేపాటి తరం భవిష్యత్తు కోసం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నీట్, సీబీఐ పేపర్ వివాదాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

