- బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను
- ప్రజాస్వామ్యం పునరుద్ధరణే న లక్ష్యం
- అవామీ లీగ్‌ను ఎవరూ అంతం చేయలేరు: షేక్ హసీనా
షేక్ హసీనా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం వల్ల తన పదవిని కోల్పోయింది, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతోంది. “నేను దేశంలో లేనంత మాత్రాన సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు. బంగ్లాదేశ్ కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అతి త్వరలోనే నేను మళ్లీ నా సొంత దేశానికి తిరిగి వెళ్తాను” తనపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యు మరణశిక్ష విధించింది, తన పార్టీ అవామీ లీగ్‌పై ప్రస్తుత ప్రభుత్వం నిషేధం విధించింది, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గింది.
ప్రజాస్వామ్యం పునరుద్ధరణే న లక్ష్యం
ఈ సందర్భంగా ఆమె తన సొంత దేశానికి వెళ్లడానికి ఒక నిర్దిష్ట తేదీ, సమయం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. “ముందుగా బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య వాతావరణం, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన తిరిగి రావాలి. ఇది కేవలం నా పునరాగమనం కోసం మాత్రమే కాదు, దేశ స్వాతంత్ర్యం – ప్రజల సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు. అలాగే తన పార్టీ అయిన ‘అవామీ లీగ్’ పై విధించిన నిషేధం గురించి మాట్లాడుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. కాగితపు ప్రకటనతో పార్టీలు అంతం కావని స్పష్టం చేశారు. “అవామీ లీగ్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్‌తో దానిని క్లోజ్ చేయడం ఎవరిది కాదు. అదే నిజమైతే అసలు బంగ్లాదేశ్ అంటే దేశమే పుట్టేది కాదు” అని గుర్తుచేశారు.
“గతంలో నాపై 19 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఎప్పుడూ భయపడి ఆగిపోలేదు. ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది మద్దతుదారులు, వేలాది మంది నాయకులు పార్టీ కోసం నిలబడుతున్నారు” అని చెప్పారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనుస్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”ఇంతకుముందు యూనస్ ప్రభుత్వం తమ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై పగబట్టి ‘రాజకీయ నరమేధం’ సృష్టించింది.ఇప్పటివరకు మా పార్టీకి చెందిన సుమారు 600 మంది నాయకులను, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది కేసులు పెట్టి జైళ్లలో బంధించారు.
భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంతో ఉన్న సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. “భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనది. భారత్ కేవలం మా పొరుగు దేశం మాత్రమే కాదు, మా దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆ దేశం అందించిన సహకారం మరువలేనిది” అని కొనియాడారు. అయితే బంగ్లాదేశ్‌లో కొన్ని రాజకీయ, తీవ్రవాద గ్రూపులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఎప్పటి నుంచో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

