మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటోంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం, విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అంటే సందిగ్ధంలో పడిపోతాం. అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే..
ఆర్థిక పరిస్థితి గురించి
ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించి అయినా ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం. కొన్నిసార్లు ఇలాంటి వాటిని చాలా పుకారు వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా వాటిని అనుసరించి తప్పుడు పనులకు మంది వ్యక్తులు జరిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేసినట్లు లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని లేదా ఎవరికైనా చెబితే.. అది కాస్త అందరికీ తెలుస్తూ చివరికి దొంగతనం మోసపోవడానికి దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం.
ఆరోగ్యం, వైద్య సమాచారం..
ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది. తీవ్రమైన అనారోగ్యాలు, మందులు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.
ఉదాహరణకు.. దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు లేదా చేతికి వెళితే సామాజికంగా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు.
ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు..
మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.
వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే ఎగతాళి చేయవచ్చు. కాబట్టి, ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి.
రిలేషన్స్, పర్సనల్ లైఫ్..
రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం గోప్యతకు భంగం కలిగించవచ్చు.
ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది. అంతేకాదు.. బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.
*రూపశ్రీ.

