హైదరాబాద్: టిజి20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వరంగల్ జట్టు బ్యాటింగ్ కోసం ముందుకొచ్చింది. పవర్ప్లెలో వరంగల్ దూకుడుగా ఆడింది. 6 ఓవర్లలో 70 పరుగులు చేసింది. మళ్లీ వరుసగా వికెట్లు కూడా కోల్పోయింది. అయినా.. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటింగ్‌లో కెప్టెన్ అమన్ రావు 45, రిషికేత్ సిసోడియా 38, శౌనక్ కులకర్ణి 24 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్‌లో అజయ్ దేవ్ 3, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముక అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి తలో వికెట్ తీశారు.

