ముద్రగడ అంత్యక్రియలు: కాపు ఉద్యమ నేత , అజాత శత్రువు ముద్రగడ పద్మనాభం నిన్న హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలం నుండి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది ముద్రగడ పద్మనాభం ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వస్తున్న ఆయన నిన్న దురదృష్టం కొద్దీ చివరి శ్వాసని విడిచారు. దీంతో రాజకీయ నాయకులంతా ఆయనకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. నేడు ఉదయం మాట్లాడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చెయ్యాలని అధికారులను ఫోన్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలు అధికార లాంచలతో కాసేపటి క్రితమే ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళ్తే ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రి చివరిసారిగా చూసేందుకు వచ్చింది. కానీ ముద్రగడ అనుచరులు ఆమెని అడ్డుకున్నారు. ఎందుకంటే క్రాంతి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి ముద్రగడ ని ఎదిరించి , జనసేన పార్టీ లో చేరింది. ముద్రగడ పై పలు విమర్శలు కూడా చేసింది . ఆ రోజుల్లో ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది. ఆ సమయం లో ముద్రగడ నాకు అసలు కూతురే లేదని అనుకుంటాను అని మీడియా ముందు చెప్పారు. అలా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ కారణంగానే , ఆయన అనుచరులు నేడు క్రాంతి ని అడ్డుకున్నారు. దీంతో ఆమె బోరుమని విలపించింది. ఆ తర్వాత పోలీసులు కలుగచేసుకొని క్రాంతి ముద్రగడ మృతదేహం వద్దకు తీసుకెళ్లారు. సొంత కూతురికి చివరి చూపు కూడా దక్కకుండా చేయాలనుకునే ఆలోచన రావడం దురదృష్టకరం అని చెప్పాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి , అందుకు ఎవ్వరూ భాద్యులు కాదు.
ఇక ముద్రగడ విషయానికి వస్తే ఈయన 1958 వ సంవత్సరం లో కిర్లంపూడి లో జన్మించారు. రాజకీయంగా ఈయన కాపు సామాజిక వర్గ ప్రజలకు చిరునామాగా నిలిచారు. వాళ్ళ సపోర్టుతో 1978 వ సంవత్సరం నుండి తొలిసారిగా జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989 వ సంవత్సరం వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ , మర్రి చెన్నారెడ్డి వంటి దిగ్గజాల ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆయన , కాపు సామాజికవర్గం కోసం ఎన్నో ఉద్యమాలు నడిపించిన మహోన్నత వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అని చెప్పాలి.

