భారతదేశ విదేశీ విధానం: ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిడి వాతావరణం.. దేశాల మధ్య యుద్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు ఇండియన్ కరెన్సీ మీద డాలర్ ఒత్తిడి పెరుగుతోంది. ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీని తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ వాణిజ్యం.. భద్రత.. ఇంకా అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక అడుగులు వేశారు. కేవలం మూడు వారాల్లోనే మూడు దేశాల అధినేతలు భారత్లో సందర్శించే విధంగా చేశారు. ట్రేడ్ ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలు ఇక్కడ కుదిరాయి.
సాయిప్రస్ దేశాధినేత నికోస్ క్రిస్టో డో లైడ్స్ ఇటీవల భారత దేశంలో ఉన్నారు. మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలో వ్యూహాత్మక దేశంగా సైప్రస్ ఉంది. యూరోపియన్ యూనియన్ లో కూడా ఈ దేశం అత్యంత కీలకం. యూరోపియన్ యూనియన్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత.. సాయిప్రస్ దేశాధినేత ఇండియా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. సాయిప్రస్ కు టర్కీ దగ్గర ఉంటుంది. టర్కీ మొదటి నుంచి కూడా మనకు వ్యతిరేక ధోరణి కనిపిస్తుంది. అందుకే టర్కీ కి చెక్ పెట్టాలంటే సాయిప్రస్ దగ్గర కావడమే భారత్ ముందున్న ఏకైక మార్గం. పైగా మిడిల్ ఈస్ట్ కారిడార్ లో ట్రేడ్ ఒప్పందాలు.. వ్యవహారాలకు సైప్రస్ అత్యంత కీలకం.
మే 30 నుంచి జూన్ 3 వరకు మయన్మార్ దేశాధినేత మిన్ ఆంగ్ రాంగ్ మనదేశంలో అందించారు. ఈ దేశం మీద అమెరికా నుంచి ఇతర దేశాల వరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బలవంతంగా అధికారాన్ని సొంతం చేసుకోవడం.. ఈ దేశానికి చైనా మాత్రమే సహకారం అందిస్తోంది. ఇక్కడ అత్యంత క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. పైగా మన దేశానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, వంటి రాష్ట్రాలలో 1600 సరిహద్దు ఈ దేశం పక్కనే ఉంది. ఈ దేశం పైన ఉన్న కొండ ప్రాంతాలలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. వారంతా కూడా ఆదివాసి తెగలకు చెందినవారు. వీరు ఇటీవల కాలంలో మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ దృశ్యాలను భారత సైనిక బృందాలు డ్రోన్ల ద్వారా గుర్తించాయి. చాలా మంది వ్యక్తులను మాదకద్రవ్యాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చూపుతున్నారు. అందువల్లే సరిహద్దుల్లో భద్రత.. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన.. ఈ అంశాలు మయన్మార్ మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్లే మయన్మార్ అధ్యక్షుడు భారత్లో ఉన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది.. చైనాతో ఉద్రిక్తతలు ఎప్పుడు కొనసాగుతాయో తెలియదు. అందువల్లే మయన్మార్ కు భారత్ అత్యంత దగ్గరైంది.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. మధురో ను అమెరికా అపహరించిన తర్వాత డెల్సి తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ వెనిజుల నుంచి ప్రతిరోజు 4,27,000 బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనుగోలు చేస్తోంది. అనేక రకాల ఇబ్బందుల నేపథ్యంలో వెనిజుల తాత్కాలిక అధ్యక్షురాలు భారత్లో పనిచేయడం.. అనేక రకాల ఒప్పందాలను భారత్ కుదుర్చుకోవడం ఇక్కడ విశేషం. అయితే భవిష్యత్తు కాలంలో ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో క్రూడ్ ఆయిల్ రాకపోతే.. వెనిజుల నుంచి భారత్ నిర్ణయించింది. దానిని అమల్లో కూడా పెట్టింది.
మూడు వారాలు.. మూడు దేశాల అధినేతలు.. ఒప్పందాలు.. ఇవన్నీ కూడా మన దేశానికి ఎంతో మేలు చేసేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దౌత్యపరంగా కీలకమైన ముందడుగు వేయకపోతే భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే మోదీ తన మార్క్ తెలివిని ఇక్కడ ప్రదర్శించారు. అందువల్లే భవిష్యత్తు కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

