విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన ఈరన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జాలవాడి మాజీ సర్పంచ్ రామన్న సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం తనవంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు వెంకన్న, అబ్బిలి భీరలింగేష్, ఉలిగప్ప, చిన్న లక్ష్మన్న, భీమేష్, చిన్న భీమేష్, పెద్దేష్, తాయన్న, రమేష్, ఓంకార్, కాసిం, మల్లేష్, వీరనాగుడు, రంగన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శాంతప్ప ఉన్నారు.

