మెట్రో రైలు విస్తరణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నగరం అనుకునే హైదరాబాద్ లో రవాణా సౌకర్యం ఉండాలని అనేకమంది భావించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మెట్రో రైలు ఏర్పాటయితే రవాణా వ్యవస్థ మరింత పెరుగుతుందని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించి దీనికి శ్రీకారం చుట్టారు. 75 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలును ఎల్.అండ్ టి సంస్థతో ప్రారంభించడం రేవంత్ రెడ్డి తెలిపారు. 2014 కేసీఆర్ మెట్రో రైలును పూర్తి చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టబడింది. 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి కాను అందించింది. 15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో అంచనా వ్యయం ఇరవై వేల కోట్లకు పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ అండ్ టి కి నష్టాలు రావడంతో మెట్రో రైలు విస్తరణ గురించి గత ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు.
ప్రజలకు నిజంగా అవసరమైన మెట్రో విస్తరణ నాటి ప్రభుత్వం చేపట్టలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలులో హైదరాబాద్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మెట్రోను విస్తరించాలన్న ఉద్దేశ్యంతో తాము రూపొందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ కు అనుమతివ్వాలని కోరామని చెప్పారు. 122 దానికి తగ్గట్టుగా మెట్రో విస్తరణ చేయాలని నిర్ణయించామని. మెట్రో విస్తరణలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎల్ అండ్ టి సంస్థ తిరస్కరించడంతో ప్రభుత్వమే మెట్రోను కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడంతో దానిని తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 30 వేల కోట్ల ఎల్ అండ్ టి ఆస్తిని పదిహేను వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐ.ఆర్.ఎఫ్.సి.తో ఒప్పందం చేసుకున్నామని, జూన్ నెల నుంచి మెట్రో టేకోవర్ ను చేయాల్సి ఉండగా కిషన్ రెడ్డి కొర్రీలు వేసి రుణాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు.

