ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇండియా ఎప్పుడూ ఆడింది లేకపోయినా, ఈ సారి కూడా పోటీలో లేకున్నా.. ఆ టోర్నీ మీద మన వాళ్లకున్న ఆసక్తి తక్కువేమీ కాదు. నిన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ అర్ధరాత్రి ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ సందడే కనిపించింది. ఐతే మన జట్టు లేని టోర్నీలో ఎక్కువమంది కోరుకున్నది అర్జెంటీనా విజయాన్నే. ఎందుకంటే అది లియోనల్ మెస్సి జట్టు. అతను ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన ఆటగాడు.
గత ఏడాది ఇండియాలో గడిపినపుడే తనకు ఇక్కడున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమైంది. నాలుగేళ్ల కిందట అతను తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇంకో కప్పుతో ఘనంగా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో వాళ్లందరికీ తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక అర్జెంటీనా అభిమానుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో ఇప్పుడు విషాదం.
ఐతే నిన్న రాత్రి ఫైనల్ చూసిన వాళ్లకు అర్జెంటీనా కప్పు గెలవాల్సిన జట్టు కాదు.. స్పెయిన్‌కే ఆ అర్హత ఉందని కచ్చితంగా అర్థమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ మీద ఆ ఐరోపా జట్టు ఆ స్థాయిలో ఆధిపత్యం చలించింది. అదనపు సమయంతో కలిపి మొత్తం 120 నిమిషాల ఆటలో బంతి పూర్తిగా స్పెయిన్ అధీనంలోనే ఉంది. ఆ జట్టు డజనుసార్లు అర్జెంటీనా గోల్ పోస్టు మీద దాడి చేసింది. కానీ అర్జెంటీనా ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్ పోస్టు మీద ఎటాక్ చేయలేకపోయింది.
మెస్సి సహా ఏ అర్జెంటీనా స్టార్‌కూ బంతి దొరకనివ్వకుండా అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న స్పెయిన్.. ఎటాక్‌లోనూ తనకు తిరుగులేదని చాటింది. పూర్తిగా మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన ఆ జట్టు 106వ నిమిషంలో టోరెస్ గోల్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అద్భుత పనితనం పుణ్యమా అని మ్యాచ్ సమయం వరకు వెళ్లింది కానీ.. స్పెయిన్ ఆడిన తీరుకు ఆ జట్టు నిర్ణీత సమయంలోనే, ఇంకా ఘనంగా మ్యాచ్ గెలవాల్సి వచ్చింది. అర్జెంటీనా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనందుకు ఆ జట్టు అభిమానులు ఎక్కువ ఫీలవ్వాల్సిన పని లేదు. ఇక మెస్సి కెరీర్‌కు ఇలాంటి ముగింపు బాధాకరమే అయినా.. ఆల్రెడీ అతను ఒక ప్రపంచకప్ సాధించాడు కాబట్టి మరో ఫైనల్ ఆడాడన్న సంతృప్తితో నిష్క్రమించాల్సిందే.
అంచనా వేసిన పఠన సమయం: 2 నిమిషాలు
కీ టేకావేలు
- భారతదేశం ఎప్పుడూ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఆడలేదు, అయినప్పటికీ దేశం యొక్క ఆసక్తి ఎక్కువగా ఉంది, ముఖ్యంగా ఈ ఫైనల్‌పై.
- లియోనెల్ మెస్సీకి ఉన్న ప్రజాదరణ కారణంగా అభిమానులు అర్జెంటీనా వైపు మొగ్గు చూపారు, నాలుగేళ్ల క్రితం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతనికి విజయవంతమైన వీడ్కోలు లభిస్తుందని ఆశించారు.
- స్పెయిన్‌తో అర్జెంటీనా ఓడిపోవడం దాని మద్దతుదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది, స్పెయిన్ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించింది మరియు 106వ నిమిషంలో నిర్ణయాత్మకంగా స్కోర్ చేసింది.
- స్పెయిన్ యొక్క అసాధారణమైన డిఫెన్స్ అర్జెంటీనా నుండి ఎటువంటి దాడులను నిరోధించింది, అర్జెంటీనా సమర్థవంతంగా పోటీపడలేక పోయింది.
- ప్రపంచ కప్‌లో మెస్సీ కెరీర్ నిరాశాజనకంగా ముగిసినప్పటికీ, అభిమానులు అతని మునుపటి విజయాలను సంతృప్తితో ప్రతిబింబిస్తారు.

