మేడిగడ్డ బ్యాటింగ్ విషయంలో బిఆర్ఎస్ నాయకులు రాజకీయ డ్రామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ఏకైక లక్ష్యమని రాష్ట్ర, మహిళ, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయమని, కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారని గుర్తుచేశారు.
అయినప్పటికీ కెటిఆర్, కెసిఆర్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడ కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరంగా కాకుండా బిఆర్ఎస్ అవినీతికి ప్రతీకగా మారిందని. లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమై ఉంది. మేడిగడ్డ కుంగిపోవడం, పంపులు మునిగిపోవడం, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడం బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతికి శాశ్వత సాక్ష్యం. ఇది నీళ్ల ఎత్తిపోతల పథకం కాదని, నిధుల ఎత్తిపోతల పథకమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని. కెటిఆర్ మాట, కెసిఆర్ మరో మాట మాట్లాడటం, నిజంగా తమ మాటలపై విశ్వాసం ఢిల్లీలో ఉంటే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎదుట తమ వాదనను నిరూపించాలని సవాల్ విసిరారు. మీడియా కెమెరాల ముందు డ్రామాలు చేయడం కంటే ముందు నిలబడి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ప్రకటిత ఇంజినీర్ల మాటలు వినదని, నిపుణుల సూచన మేరకే ముందుకుసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
మేడిగడ్డను శాశ్వతంగా ఎలా భద్రపరచాలి, కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను ఎలా సురక్షితంగా వినియోగంలోకి తీసుకురావాలి, ప్రజాధనాన్ని ఎలా కాపాడాలనే దానిపై నిపుణులతో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే రాజకీయాలు కాంగ్రెస్ చేయదని, తెలంగాణ ప్రజల భద్రత తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అవినీతిని కాపాడేందుకు కాదు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, నిజాలు ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, కిసాన్ మార్కెట్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్, పంచాయితీరాజ్ శాఖ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ కొండ రవీందర్ రెడ్డి ఉన్నారు.

