హైదరాబాద్: మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి- మురహరిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. కారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొంది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు.

