హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ తదితరాల కోసం పీజీ కోర్సుల్లో ఈ నెల 28 నుంచి టీజీ పీజీసెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 26,005 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావడానికి కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు. మే 28న ఉదయం సెషన్లో జియో-ఇంజనీరింగ్, సీసీ అభ్యర్థులకు, మధ్యాహ్నం సెషన్లో సివిల్, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
మే 29న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయో-టెక్నాలజీ, మెకానికల్, మధ్యాహ్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ పరీక్షలు ఉంటాయి. మే 30న ఉదయం ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, టెక్స్టైల్, మైనింగ్, మధ్యాహ్నం ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. మే 31న చివరి రోజున ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, నానో టెక్నాలజీ పరీక్షలు జరుగుతున్నాయి.

